TPT: త్వరలో జరగనున్న రాష్ట్రస్థాయి దివ్యాంగ క్రికెట్ పోటీలకు ఆసక్తిగల అభ్యర్థులు శుక్రవారం లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆ కమిటీ చైర్మన్ సూర్యనారాయణ తెలిపారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, దివ్యాంగ క్రికెట్ కమిటీ, ఏపీ దివ్యాంగ క్రికెట్ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం 9985882559 నంబర్లో సంప్రదించాలని సూచించారు.