BPT: చీరాలలో ఈనెల 17న ఎన్ఆర్ అండ్ పీఎం ఉన్నత పాఠశాల ఆవరణలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎమ్మెల్యే కొండయ్య సహకారంతో జరిగే ఈ మేళాకు విద్యార్హత జిరాక్స్ పత్రాలు, ఆధార్, పాస్పోర్ట్ ఫొటోలతో హాజరు కావాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారిణి ఎం.మాధవి ఒక ప్రకటనలో కోరారు.