KRNL: పెన్షన్ లబ్ధిదారులకు డిసెంబర్ 31వ తేదీన పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మిగనూరు మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి తెలిపారు. పట్టణంలో మొత్తం 9,651 మందికి ఉదయం నుంచి సచివాలయం ఉద్యోగుల ద్వారా పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. లబ్ధిదారులందరూ 31న ఇళ్ల వద్ద అందుబాటులో ఉండాలని కోరారు.