TPT: సూళ్లూరుపేట MLA నెలవల విజయశ్రీ శుక్రవారం పెళ్లకూరు MPDO కార్యాలయం వద్ద ప్రజా దర్బార్ నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై సమస్యలు వినిపించగా, మొత్తం 40 వినతులను PGRSలో వెంటనే నమోదు చేశారు. సంబంధిత శాఖలకు అక్కడికక్కడే సూచనలు చేసి చర్యలు తీసుకునేలా ఆదేశించారు. అనంతరం బాలల దినోత్సవం సందర్భంగా పెళ్లకూరు హై స్కూల్లో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు.