CTR: తవణంపల్లి మండలం వెంగంపల్లి గ్రామంలో ఓ ఆవుపై అడవి జంతువు దాడి చేసిందని స్థానికులు వాపోయారు. ఇది చిరుత పనే అయి ఉంటుందని వారు అనుమానం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న వెంటనే ఫారెస్ట్ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి సమయంలో ఒంటరిగా బయట తిరగొద్దని సూచించారు.