ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని భైరవకోన క్షేత్రాన్ని హైకోర్టు జడ్జి సుజాత కనిగిరి జడ్జి రూప శ్రీతో కలిసి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీ భైరవేశ్వర స్వామి, ప్రముఖ దుర్గాంబ దేవిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం వేద పండితులు వారికి ఆశీర్వచనాలను అందజేసి, తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.