SS: సోమందేపల్లి నక్కలగుట్ట కాలనీ ఎస్సై రమేశ్ బాబు శుక్రవారం రాత్రి అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. గంజాయి, మద్యం, గుట్కా, సిగరెట్, వీటి వల్ల ఎన్నో జీవితాలు నాశనం చేసుకుంటున్నారని, ఇలాంటి వాటికి దూరం ఉండాలని తెలిపారు. తల్లిదండ్రులు, పిల్లకు మంచి చదువు చదివించాలని, ఏదైనా సమస్య వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.