WG: జిల్లా వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులకు మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశామని కలెక్టర్ నాగరాణి తెలిపారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో భాగంగా సోమ, మంగళవారాల్లో జిల్లా వ్యాప్తంగా 7వైద్య శిబిరాలను నిర్వహించి 1,074 మంది పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలను నిర్వహించామన్నారు. పారిశుద్ధ్య కార్మికులు సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారన్నారు.