KDP: చెన్నూరు మండల కేంద్రంలోని శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయంలో గురువారం నక్షత్ర శాంతి నవగ్రహ శాంతి పూజ హోమం ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామివారి మూలవిరాట్‌కు పంచామృత అభిషేకం చేసి, ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం భక్తులు మల్లేశ్వర స్వామి, గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించారు.