కృష్ణా: గుడివాడ 19వ వార్డులో మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్ బుధవారం పర్యటించారు. ఈ క్రమంలో వార్డులోని ప్రజలు నీటి, పారిశుద్ధ్యం వంటి సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. నీటి సరఫరా సమయంలో పంతులు షెడ్ రోడ్డు, నీలం బెంజిమెన్ రోడ్డును సందర్శించి, త్రాగునీటి సమస్య నివారణ కొరకు నూతన పైప్ లైన్ అంచనాలను తయారు చేయాలని ఇంజనీరింగ్ సిబ్బందికి ఆదేశించారు.