BLGL: సీ. బెలగల్ మండలం పలుకుదొడ్డిలో బోయ బుజ్జమ్మ(25) కిడ్నీ వ్యాధితో మృతి చెందారు. కనకవీడు గ్రామానికి చెందిన బోయ బుజ్జమ్మను పలుకుదొడ్డి గ్రామానికి చెందిన బోయ నాగేంద్రకు ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. కాగా, బోయ నాగేంద్ర రెండేళ్ల క్రితం చనిపోయారు. దీంతో వారి కుమారుడు అనాథగా మిగిలిపోయాడంటూ గ్రామస్థులు, బంధువులు కన్నీరుగా విలపిస్తున్నారు.