W.G: గణపవరం మండలాన్ని పశ్చిమగోదావరి జిల్లాలోనే ఉంచాలని, భీమవరం కేంద్రంగా పరిపాలన కొనసాగించాలని గణపవరం మండల అఖిలపక్షం నాయకులు ఎమ్మెల్యే పితాని సత్యనారాయణకు శనివారం టీడీపీ క్యాంప్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందచేశారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి తమ సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే సత్యనారాయణను కోరారు.