కోనసీమ: అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం లో ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి సోమవారం స్వామి వారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు వారికి శ్రీ స్వామి వారి తీర్థప్రసాదాలు అందించారు.