కృష్ణా: జెరూసలేములో ఇశ్రాయేలు ప్రజలపై జరిగిన ఉగ్రవాద దాడి అత్యంత బాధాకరమని ఏపీ బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ మట్టా ప్రసాద్ మంగళవారం పెడనలో అన్నారు. ఈ దాడిని యావత్ భారతదేశం ఖండిస్తుందని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ దేశాలు మానవత్వంతో, శాంతితో విలసిల్లాలని ఆయన ఆకాంక్షించారు.