KDP: ప్రొద్దుటూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ను గురువారం డీఎస్పీ భావన తనిఖీ చేశారు. సాధారణ తనిఖీల్లో భాగంగా డీఎస్పీ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో రికార్డులను పరిశీలించారు. సీఐ సదాశివయ్య కేసుల వివరాలను డీఎస్పీకి తెలిపారు. కేసుల నమోదు, విచారణ వివరాలను పరిశీలించారు. పెండింగ్ కేసులపై సమీక్షించారు. రికవరీ, పరిష్కారమైన కేసులను పరిశీలించారు.