KKD: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, నవంబర్ 16న సికింద్రాబాద్ నుండి కాకినాడ టౌన్ కు ప్రత్యేక రైలును నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.ఈ రైలు చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి,గుంటూరు, విజయవాడ,గుడివాడ, కైకలూరు,ఆకివీడు,భీమవరం, తణుకు, రాజమహేంద్రవరం, సామర్లకోట స్టేషన్ల మీదుగా కాకినాడ చేరుతుందన్నారు