ELR: జిల్లాను స్వచ్ఛ ఏలూరు జిల్లాగా రూపొందించేందుకు కృషి చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. జిల్లాలో పారిశుద్ధ్యం, ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్వహణ, తదితర అంశాలపై జిల్లా అధికారులు, ఎంపీడీవోలతో ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో ఎక్కడ బహిరంగ మలవిసర్జన జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.