KDP: పులివెందుల జయమ్మ కాలనీకి చెందిన కానాల విజయకుమార్ రెడ్డి (36), కదిరిలో స్టేట్ బ్యాంక్ మేనేజర్‌గా పనిచేస్తున్న బ్యాంకు ఉద్యోగి, ఛాతి నొప్పితో బాధపడుతూ బుధవారం ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతుండగా గురువారం ఆయన పరిస్థితి విషమించి మృతి చెందారు. ఆయన ఆకస్మిక మరణంతో కుటుంబంలో విషాదం నెలకొంది. మృతునికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.