చిత్తూరు: పుంగనూరు పట్టణ పరిధిలోని గూడూరుపల్లె సమీపంలో ఉన్న ప్రభుత్వ మైనారిటీ ఐటీఐ ఆవరణలో నేడు ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. మంగళవారం ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు. అర్హులైన యువత ఉద్యోగ మేళాను సద్వినియోగం చేసుకొని ఉపాధి పొందాలని సూచించారు.