KKD: జిల్లాలో మద్యం విక్రయాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గత ఏడాది ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు జరిగిన అమ్మకాల గణాంకాలను అబ్కారీ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది కాలంలో జిల్లాలో 15,39,167 కేసులు లిక్కర్ 10,62,714 కేసులు బీరు అమ్ముడయ్యాయని తెలిపింది. దీంతో ఏకంగా రూ.1,246.18 కోట్ల ఆదాయం సమకూరింది. గతంతో పోలిస్తే లిక్కర్ అమ్మకాలు 12 శాతం, బీరు అమ్మకాలు 5 శాతం పెరిగాయి.