NLR: సంగం జాతీయ రహదారి కూడలి వద్ద రోడ్డు స్థలం వివాదంలో ఇరువర్గాల మధ్య శనివారం ఘర్షణ చోటు చేసుకున్నది. ఓ వర్గంకి సంబంధించిన దుకాణం ధ్వంసం, చేసి నలుగురిపై మరొక వర్గం దాడి చేశారు.దీంతో గాయాలపాలైన వారిని 108లో స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో చేర్చి, మెరుగైన వైద్యం కోసం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితులను అదుపులోకి తెచ్చి, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.