VSP: వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 – 20 మధ్య జరిగే IFR-2026, మిలాన్ వేడుకలకు అధికారులు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని గురువారం కలెక్టరేట్లో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సూచించారు. ఇందులో భాగంగా రాష్ట్రపతి, ప్రధాని సహా 135 దేశాల ప్రతినిధులు పాల్గొననున్నందున రోడ్లు, డ్రెయిన్లు, వంతెన పనులు నవంబర్‌లోపు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.