VJM: స్నేహశీలి సీతారామ్ ఏచూరి అని కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు వ్యాఖ్యానించారు. విజయనగరంలో జరిగిన సీతారాం ఏచూరి సంస్మరణ సభలో ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్లో ఆయనతో ఉన్న పరిచయాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. రాజకీయాలకు అతీతంగా అందరిని కలుపుకుపోయే వ్యక్తి అని అన్నారు. ఆయన సిద్ధాంతం కోసం చివరి వరకు అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు.