ప్రకాశం: మండల కేంద్రంలోని నూతన సచివాలయం, రైతు సేవ కేంద్రాలు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. త్వరలో ఈ భవనాలకు ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరుగుతాయని సర్పంచ్ తాతపూడి సురేశ్ బాబు తెలిపారు. సచివాలయం రైతు సేవ కేంద్రానికి వెళ్ళేటకు రహదారి పనులను సర్పంచ్ సురేశ్ బాబు పర్యవేక్షించారు. సర్పంచ్ మాట్లాడుతూ.. రహదారికి కంకర చిప్స్ వేయించి పనులు వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు.