ప్రకాశం: కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని సాయి నగర్, శివనగర్ కాలనీలో మంగళవారం ఆరోగ్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిసరాల పరిశుభ్రతతో డెంగ్యూ లాంటి ప్రమాదకర జ్వరాలు, వ్యాధులు బారిన పడకుండా ఉండవచ్చని ప్రజలకు సూచించారు.