KDP: మన చుట్టూ ఉన్న పరిసరాల పరిశుభ్రత పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని స్టేట్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ పేర్కొన్నారు. స్వచ్చత హి సేవ కార్యక్రమంలో భాగంగా స్టేట్ బ్యాంక్ ఉద్యోగులు కడపలో ఆదివారం ఉదయం స్వచ్ఛత ర్యాలీ నిర్వహించారు. దిశ పోలీస్ స్టేషన్ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు ర్యాలీ సాగింది. అనంతరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు.