NLR: సూళ్లూరుపేలోని శ్రీహరికోటకి వెళ్లే మార్గంలో ఉన్న ఉల్సాపడవ రోడ్డు చెత్త చెదారాలతో నిండిపోయి డంపింగ్ యార్డ్‌ను తలపిస్తుంది. చుట్టుపక్కల ఉన్న వ్యాపారస్తులు వ్యర్ధాలను తీసుకొచ్చి రోడ్డుకు ఇరువైపులా వేయడంతో ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణం కంపుగా మారిందని అటువైపు వెళ్లే గ్రామ ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించాలని స్థానికులు కోరుకుంటున్నారు.