ASR: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 6వ తేదీన జల ఉత్సవంను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా విభాగం, జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారులను ఆదేశించారు. ఈనెల 6వ తేదీ నుండి 20వ తేదీ వరకు గ్రామ పంచాయతీలు, మండల కేంద్రాల్లో జల ఉత్సవం కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.