NDL: బనగానపల్లె మండలం పలుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఈనెల 24న మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు MEO స్వరూప ఓ ప్రకటనలో వెల్లడించారు. క్రీడా పోటీల్లో పాల్గొనే విద్యార్థులు ఆయా గ్రామాల వ్యాయామ ఉపాధ్యాయులు, మండల కోఆర్డినేటర్‌కు తమ వివరాలను సమర్పించాలని ఎంఈవో సూచించారు. క్రీడా పోటీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు.