NLR: బుచ్చి పట్టణంలో ప్రభుత్వ అక్రమ స్థలాలను నగర కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి గుర్తించారు. గుర్తించిన స్థలాల వద్ద గోడలపై ప్రభుత్వ స్థలమని ఆక్రమిస్తే చర్యలు తప్పవని పెద్ద అక్షరాలతో గోడల మీద రాశారు. దీనిని గమనించిన ఆక్రమ దారులు ఎరుపు రంగుతో వాటిని చెరిపేశారు. దీనిపై నగర కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.