VSP: విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం ఖచ్చితమైన వాతావరణ సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తూ సేవలు అందిస్తున్నట్లు విశాఖ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అన్నారు. మంగళవారం ఏయూలో నిర్వహించిన విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం స్వర్ణోత్సవాల్లో కలెక్టర్ పాల్గొన్నారు. సాంకేతిక సహాయాన్ని మరింత పెంపొందించుకోవడం ద్వారా భవిష్యత్తులో సంభవించే ప్రమాదాలను నివారించాలన్నారు.