కృష్ణా: విజయవాడ నగర అందాలను మరింత పెంచేందుకు కాలవ బ్యూటిఫికేషన్ పనులు ముమ్మరంగా చేపడుతున్నట్లు నగర కమిషనర్ ధ్యాన్ చంద్ర తెలిపారు. రామలింగేశ్వరనగర్, జక్కంపూడి తదితర ప్రాంతాలలోని కాలువలను మంగళవారం ఆయన పరిశీలించారు. బ్యూటిఫికేషన్ పనులు పూర్తయితే కాలుష్యం తగ్గుతుందని వివరించారు. ఈ పనులు వెంటనే చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.