గుంటూరు: జిల్లాలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు అత్యధికంగా వట్టిచెరుకూరు మండలంలో 23.2 మి.మీ వర్షపాతం నమోదయినట్లు అధికారులు తెలిపారు. గుంటూరు తూర్పు మండలంలో 18.2, ప్రత్తిపాడు 12.8, పొన్నూరు 10.2, తుళ్లూరు 10.2, తాడికొండ 8.4, మేడికొండూరు 7.8, గుంటూరు పశ్చిమ 5.4, మంగళగిరి 4, తాడేపల్లి 1.8, ఫిరంగిపురం మండలంలో 1.2 మి.మీ వర్షపాతం నమోదైంది.