NLR: మంత్రి నారా లోకేష్ ఆరోగ్య రక్ష కార్యక్రమం రాష్ట్రం మొత్తం ఆదర్శంగా నిలవాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆకాంక్షించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని దేవరపాలెం గ్రామంలో ఆరోగ్య రక్ష కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పేద ప్రజల ఆరోగ్యం కోసం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.