కృష్ణ: ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని గుడ్లవల్లేరు పంచాయతీ కార్యదర్శి నరసింహారావు సచివాలయ కార్యదర్శి సుధారాణి కోరారు. స్వఛ్ఛతా హీ సేవలో భాగంగా ప్లాస్టిక్ వ్యర్థాలు, విద్యుత్ వాడకంపై వ్యాపారులు ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పంచాయతీ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.