KDP: పులివెందుల పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు అధికమయ్యాయి. పట్టణంలోని సెంట్రల్ బోలేవార్డు, శ్రీరామ హాలు ప్రాంతం, మారుతి హాలు ప్రాంతాలలో పద్మవ్యూహంలా ట్రాఫిక్ సమస్య మారింది. ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలుపుతుంటే వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ఈ ప్రాంతాలలో పెద్ద వాహనాలైన లారీలు, ట్రాక్టర్లు, గూడ్స్ వెహికల్స్, ఆర్టీసీ బస్సులు ప్రయాణిస్తుంటాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.