కోనసీమ: కొత్తపేటలోని 11KV లైన్ అభివృద్ధి పనులు చేయు నిమిత్తం కొత్తపేట గ్రామంలోని పలు ప్రాంతాలకు మంగళవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని అమలాపురం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం.రవికుమార్ తెలిపారు. ఈ విద్యుత్ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.