W.G: కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి కార్మికులకు వ్యతిరేకంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు భీమారావు డిమాండ్ చేశారు. జాతీయ కేంద్ర కార్మిక సంఘాల దేశ వ్యాపిత పిలుపులో భాగంగా సోమవారం ఉండిలో ఏఐటీయూసీ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.