NDL: చాగలమర్రి మండలం ముత్యాలపాడులోని చెరువు వద్ద ట్రాక్టర్ బోల్తా పడి శ్రీనివాస్ నాయక్(19) మృతిచెందిన ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఓజి తండాకు చెందిన శ్రీనివాస నాయక్ తమ పొలంలో సాగుచేసిన మొక్కజొన్నను ముత్యాలపాడులో ఆరబోసేందుకు ట్రాక్టర్లో తీసుకెళ్తుండగా చెరువు వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో అక్కడిక్కడే మృతిచెందాడు.