TPT: చంద్రగిరి కోటలో సౌండ్ అండ్ లేజర్ షో ట్రయల్ రన్ మంగళవారం రాత్రి నిర్వహించారు. దీనిని ఈ నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకుని సీఎం చంద్రబాబు నాయుడు వర్చువల్గా ప్రారంభించనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో దాదాపు రూ.6 కోట్లతో పునరుద్ధరణ చేశారు. చంద్రగిరి కోటకు పూర్వవైభవం రానుంది. 6సంవత్సరాల తరువాత లైటింగ్ సిస్టం ఏర్పాటు చేశారు.