ASR: డుంబ్రిగూడ మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం నుంచి ఏకదాటిగా కురుస్తున్న వర్షానికి పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, శుక్రవారం అరకు వారపు సంతకు వెళ్లే గిరిజనులు ఇబ్బందులు పడ్డారు. అలాగే ప్రముఖ పర్యటక కేంద్రమైన చాపరాయి జలపాతాన్ని తిలకించేందుకు వచ్చిన పర్యటకులు కురుస్తున్న వర్షానికి నిరాశతో వెనుతిరిగారు. రహదారి చిత్తడిగా మారడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.