NDL: డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డికి బేతంచెర్ల మండల మాజీ వాలంటరీలు వినతి పత్రం ఇచ్చారు. ఎన్నికల ముందు తాము వాలంటరీ విధులకు రాజీనామా చేయలేదని, తమకు తిరిగి విధుల్లోకి తీసుకొని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వాలంటీర్లకు రూ.10,000 ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని గుర్తుచేశారు.