మన్యం: పార్వతీపురం నుండి కూనేరు మీదుగా మూడు రాష్ట్రాలకు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారి అద్వాన్నంగా మారిందని సీపీఎం నేత సాంబమూర్తి, లారీ డ్రైవర్ల అసోసియేషన్ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. కొమరాడ మండల కేంద్రంలోని బుధవారం స్వచ్ఛందంగా గోతులు కప్పారు. రహదారి అభివృద్ధికి కలెక్టర్ రూ.11.75 కోట్లు ప్రకటించారని, వెంటనే నిధులు మంజూరు చేయాలన్నారు.