ASR: గూడెం కొత్తవీధి మండలం డేరాల గ్రామంలో అసంపూర్తిగా నిలిచిపోయిన అంగన్వాడీ భవన నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని గ్రామస్తులు గురువారం కోరారు. గతంలో మంజూరైన అంగన్వాడీ భవన నిర్మాణం, పిల్లర్లు వేసి అలాగే వదిలేశారని అన్నారు. అంగన్వాడీ భవనం లేక పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి భవన నిర్మాణం పూర్తి చేయాలని కోరారు.