MDK: ఆసియాలోనే రెండో అతి పెద్ద చర్చిగా పేరుగాంచిన మెదక్ కెథడ్రల్ చర్చిలో 101వ క్రిస్మస్ వేడుకలు అంగరంగా వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆనవాయితీ ప్రకారం తెల్లవారుజామున చర్చి కమిటీ బాధ్యులు శిలువను ఊరేగింపుగా తీసుకువచ్చి చర్చిలోని ప్రధాన వేదిక మీద ప్రతిష్టించారు. తెల్లవారుజామున 4:30 గంటలకు ప్రాతఃకల ఆరాధనాతో మెదక్ చర్చిలో క్రిస్మస్ మహోత్సవం ప్రారంభం అయ్యింది.