CTR: పుంగనూరు మండలంలో ఈ నెల 26న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటిస్తారని ఎంపీపీ అక్కిసాని భాస్కర్ రెడ్డి తెలిపారు. ఆరోజు ఉదయం ఎనిమిది గంటలకు ఈడిగ పల్లెలో పర్యటన ప్రారంభం అవుతుందని ఆయన చెప్పారు. మంగళం గ్రామపంచాయతీలో పర్యటన ముగుస్తుందన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం నిర్వహిస్తారని వెల్లడించారు. అందరూ పాల్గొనాలని కోరారు.