NGKL: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 28న జిల్లాలో పర్యటించనున్నారు. ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుతో అచ్చంపేట, నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో గెలిచిన సర్పంచులను ఆయన గౌరవించనున్నారు. కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కోరారు.