JGL: వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చి అధిక పంట దిగుబడులకు వ్యవసాయ విద్యార్థులు పూర్తి స్థాయిలో కృషి చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. బుధవారం జగిత్యాల మండలం పొలాసలోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విద్యాలయంలో విద్యార్థులతో నిర్వహించిన ఇంటరాక్షన్ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.