ADB: ప్రజా రక్షణలో 24 గంటలు కృషి చేస్తున్న బలమైన శక్తిగా ఉండే పోలీసు వ్యవస్థ సిబ్బందికి క్రమశిక్షణ సమయపాలనతో పాటుగా, నీతి నిజాయితీలు తప్పనిసరిగా ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. వార్షిక తనిఖీలలో భాగంగా తలమడుగు పోలీస్ స్టేషన్ను బుధవారం పరిశీలించారు. స్టేషన్లో క్రమం తప్పకుండా రికార్డ్లు మెంటెన్ చేయాలని ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు.