AKP: ఎస్ రాయవరం మండలం ఏఐఎస్ఎఫ్ మండల కన్వీనర్‌గా రేవు పోలవరం గ్రామానికి చెందిన జీ. అప్పలరాజు ఎన్నికయ్యారు. అనకాపల్లి సీపీఐ కార్యాలయంలో బుధవారం ఏఐఎస్ఎఫ్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించినట్లు అప్పలరాజు తెలిపారు. ఎస్ రాయవరంలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సంక్షేమ వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలన్నారు.